నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్‌ను జనగామ సర్పంచ్ మట్ట శ్రీనివాస్, ఉప సర్పంచ్ పాత స్వామి, వార్డు సభ్యులు వడ్ల నర్సింహాచారి, బెల్లె వంశీ, పాలకవర్గ సభ్యులు కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామ ప్రజలకు అవసరమైన చోట్ల బస్సులు ఆగే విధంగా కొత్త రిక్వెస్ట్ స్టాప్‌లను ఏర్పాటు చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు.
2013 – 2020 మధ్యకాలంలో జనగామ నుండి కామారెడ్డి కాలేజీలకు వెళ్లే విద్యార్థుల కోసం ఉదయం షటిల్ బస్ సౌకర్యం ఉండేదని గుర్తుచేస్తూ, ప్రస్తుతం అది లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విద్యార్థుల ప్రయాణ సౌలభ్యం కోసం తిరిగి ఉదయం షటిల్ బస్‌ను ప్రారంభించాలని డిపో మేనేజర్‌ను కోరారు. ఈ అంశాలపై డిపో మేనేజర్ సానుకూలంగా స్పందిస్తూ, త్వరలోనే జనగామ ప్రజలు ఎదుర్కొంటున్న బస్ అసౌకర్యాలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.



