- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయాన్ని బుధవారం మద్నూర్ గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి ఉపసర్పంచ్ వట్నాల రమేష్ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. పూజలు చేసిన నాయకులకు ఆలయ పూజారి అరవింద్ మహారాజ్ ప్రత్యేకంగా సన్మానించారు. వారి వెంట వార్డు సభ్యుడు దశరథ్ ఉన్నారు. ప్రత్యేక పూజలు అనంతరం పూజారి ఆ నాయకులకు తీర్థాన్ని అందించారు. అనంతరం ఆలయ ఆవరణంలో మహారాష్ట్రలోని దేగ్లూర్ పట్టణానికి చెందిన ఒక భక్తుడు మహా అన్నదానం నిర్వహించగా.. ఆ అన్నదాన కార్యక్రమంలో వారు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
- Advertisement -



