Tuesday, February 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన సర్పంచ్

మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – ఊరుకొండ 
ఆపదలో ఉన్న బడుగు బలహీనవర్గాల పేద ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు అందించి ఆదుకుంటానని ఇప్పపహాడ్ గ్రామ సర్పంచ్ బెక్కరి సునీత రాజశేఖర రెడ్డి అన్నారు. మంగళవారం ఊరుకొండ మండల పరిధిలోని ఇప్పపహాడ్ గ్రామానికి చెందిన దుబ్బ పరుశరాములు(55) అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మృతి చెందారు. స్థానిక కాంగ్రెస్ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న ఇప్పపహాడ్ గ్రామ సర్పంచ్ బెక్కరి సునీత రాజశేఖర రెడ్డి బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ.. తక్షణ సహాయం కింద బాధిత కుటుంబ సభ్యులకు రూ.10వేల ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో ఎన్నం విష్ణువర్ధన్ రెడ్డి, దుబ్బ రాములు, దుబ్బ మల్లేష్, అంతరం శివ, ఎన్నం కిషోర్ రెడ్డి, దుబ్బ రాజు, నాగరాజు, చంద్రయ్య, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -