- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా ఉషా సంతోష్ మేస్త్రి గెలిచిన విషయం తెలిసిందే. మంగళవారం లబ్ధిదారుల ఇండ్లకు భూమి పూజ చేసేందుకు సర్పంచ్ ఉష-భర్త సంతోష్ మేస్త్రి గంప పట్టి, ముగ్గుపోసి ప్రారంభించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి భూమి పూజ చేశారు. దీంతో స్వయంగా సర్పంచ్ వచ్చి ఇంటి నిర్మాణాలను ప్రారంభించడం ఎంతో సంతోష కరమని లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సందీప్ కుమార్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు బండి గోపి, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు సచిన్, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు.
- Advertisement -



