Monday, January 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మథురా తండాలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సర్పంచ్

మథురా తండాలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని మథురా తాండాలో గ్రామ సర్పంచ్ చౌహాన్ అనిత మోహన్  ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను గ్రామంలో విద్యార్థులు గ్రామ ప్రజలతో కలిసి సందడిగా సంబరంగా నిర్వహించారు. అంతకుముందు గ్రామ సర్పంచ్ జిపి కార్యాలయంలో కార్యదర్శితో కలిసి జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ఆటలు పోటీలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. తాండవాసులకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ , ఉప సర్పంచ్ , గ్రామపంచాయతీ కార్యవర్గ సభ్యులు , జిపి సెక్రెటరీ , తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -