Wednesday, January 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్పంచులు ఐక్యంగా ఫోరం ఏర్పాటు చేసుకోవాలి 

సర్పంచులు ఐక్యంగా ఫోరం ఏర్పాటు చేసుకోవాలి 

- Advertisement -

ఎమ్మెల్యే జోక్యం చేసుకోవాలి 
బిఆర్ఎస్, సీపీఐ(ఎం) సర్పంచులు
నవతెలంగాణ – ఆలేరు రూరల్ 

ఆలేరు మండలంలోని సర్పంచ్ లందరూ ఐక్యంగా ఒకే వేదికపై కి వచ్చి ఫోరం ఏర్పాటు చేసుకోవాలని సీపీఐ(ఎం), బి.ఆర్.ఎస్ సర్పంచులు పిలుపునిచ్చారు. ఆలేరులోని ప్రభుత్వ రహదారి బంగ్లాలో శనివారం సీపీఐ(ఎం), బి ఆర్ ఎస్ పార్టీల మద్దతుతో గెలుపొందిన సర్పంచులు సమావేశమయ్యారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచులు ఫోరం ఏర్పాటు చేసుకోవడం వల్ల గ్రామాలలో సమస్యలు పరిష్కారం కావన్నారు. మండలంలోని సర్పంచ్లందరూ ఐక్యంగా ఉన్నప్పుడే మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధి చెందాయి అన్నారు.

అధికారులతో ఎంపీ ఎమ్మెల్యేలతో నిధులు ఆలేరు మండలానికి సింహభాగం తెప్పించుకునేందుకు ఐక్యమత్యమే ఉపయోగపడుతుందన్నారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య నూతన సర్పంచులు గెలుపొందిన సందర్భంగా అభినందనలు తెలుపుతూ  పార్టీలక తీతంగా గ్రామాలను అభివృద్ధి చేయాలని ప్రజా పాలనను ప్రజల్లోకి తీసుకురావాలన్న విషయాన్ని గుర్తు చేశారు. కానీ కొందరు సర్పంచులు ఏకపక్షంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు.

సర్పంచ్ల అందరిని కలిపేందుకు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య జోక్యం చేసుకోవాలన్నారు. ఇప్పటికైనా అందరమూ ఒకే వేదిక పైకి వచ్చి ఫోరం ఏర్పాటు చేసుకోవాలన్నారు. సర్పంచులు పార్టీ గుర్తులపై గెలిచిన వారు కాదన్నారు. సర్పంచ్లందరూ కలిసి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు జూకంటి అనిల్ దూపటి లక్ష్మీ వెంకటేష్, వడ్ల శోభన్ బాబు, మొగలగాని నరసయ్య, బెదరబోయిన యాకమ్మ వెంకటేష్,పరిదె మమత సంతోష్,ఏసిరెడ్డి మంజుల మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -