-ఎమ్మెల్యేతో నియామక పత్రం అందుకున్న రమేష్ నాయక్
– ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి
నవతెలంగాణ – ఊరుకొండ
ఊరుకొండ మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు అందరికి పార్టీలకతీతంగా తోడ్పాటునిస్తూ.. ఐక్యంగా ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఊరుకొండ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా గుండ్లగుంటపల్లి గ్రామ సర్పంచ్ జర్పులావత్ రమేష్ నాయక్ కు జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నా ఎన్నికకు సహకరించిన స్థానిక ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డికి, నా తోటి సర్పంచులు రుక్మారెడ్డి, మహేష్, బంగారు, శేఖర్ యాదవ్, రేణమ్మ తిరుపతయ్య, మంజుల శ్రీనివాస్, అలివేలఆంజనేయులు, అంజమ్మహనుమంతు, సోనీనరసింహ, తిరుపతమ్మశివయ్య, శైలజశ్రీశైలంలకు అందరికి పేరు పేరునా ఊరుకొండ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు, గుండ్లగుంటపల్లి గ్రామ సర్పంచ్ రమేష్ నాయక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజా ప్రతినిధులు, యువజన కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
సర్పంచులు పార్టీలకతీతంగా ఐక్యంగా ముందుకెళ్లాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



