Sunday, November 2, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిసారు మస్తుజెప్పిండు…

సారు మస్తుజెప్పిండు…

- Advertisement -

‘దేశంలో అనేక మంది నేను ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్‌లో అత్యధిక మంది నాయకులు నాకు అనుకూలంగా ఉన్నారు. కానీ నేను ప్రధాని కావటం కంటే మీరు ప్రధాని కావటం వల్లే దేశానికి ఎక్కువ ఉపయోగం…’ మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో సర్దార్‌ వల్లభాయిపటేల్‌, నెహ్రూగారికి రాసిన లేఖ సారాంశమిది.
***
‘పటేల్‌ గారు లేనిలోటు దేశానికే కాదు.. వ్యక్తిగతంగా నాకు కూడా తీరని లోటు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు…’ 1950లో వల్లభాయిపటేల్‌ మరణించినప్పుడు పార్లమెంటులో కన్నీటిపర్యంతమవుతూ ఆనాటి ప్రధాని నెహ్రూ చేసిన ప్రసంగమిది. ప్రధాని హోదాలో నెహ్రూ కూర్చుంటే, కేంద్ర హోంమంత్రిగా ఉన్న పటేల్‌… పార్లమెంటులో నెహ్రూ గారి పక్కనే కూర్చుని దేశానికి సంబంధించిన అనేకాంశాలపై చర్చలు, సమాలోచనలు చేసేవారట. పటేల్‌తో తనకున్న ఈ అవినాభావ సంబంధానికి గుర్తుగా ఆయన మరణించిన తర్వాత కూడా నెహ్రూగారు తన పక్క సీటును వేరే మంత్రికి కేటాయించకుండా పటేల్‌ను గౌరవించుకున్నారట. నెహ్రూ గారికి, పటేల్‌కు మధ్యనున్న స్నేహానికి, అవినాభావ సంబంధానికి, అంతకుమించి దేశ భవిష్యత్‌పై వారికున్న ముందుచూపుకు నిదర్శనాలివి.
కట్‌ చేస్తే…
తాజాగా గుజరాత్‌లో నిర్వహించిన పటేల్‌ 150వ జయంతోత్సవాల్లో ప్రధాని మోడీ ప్రసంగించిన తీరు, ఆయన నెహ్రూ గారిపై చేసిన విమర్శలు చూసి రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు నోరెళ్లబెడుతున్నారు. ‘కాశ్మీర్‌ అంశంలో నెహ్రూ తప్పు చేశారు. పటేల్‌ అభిప్రాయానికి ఆయన విలువే ఇవ్వలేదు…’ అంటూ ప్రథమ ప్రధానిపై నేటి మన పీఎం ధ్వజమెత్తారు. ఇది చూసిన వారంతా…’అబ్బ మన పెద్దసారు… మస్తు జెప్పిండ్రాబరు.. అచ్చం, నెహ్రూ, పటేల్‌ గారి పక్కనే కూర్చుని, మొత్తం చూసినట్టే చెప్పిండ్రా బరు..’ అని గుసగుసలాడుకుంటున్నారు. అసలే మన పెద్దసారు చదివిన చదువుల మీద, ఆయన డిగ్రీల మీద, దేశ రాజకీయాల మీద వారికున్న పట్టుమీద ప్రజలందరికీ ‘మస్తు నమ్మకముంది…’గదా…
-బి.వి.యన్‌.పద్మరాజు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -