నవతెలంగాణ – గండీడ్
మండల పరిధిలోని చిన్నవార్వాల్ ప్రాథమిక పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసే నివాళులర్పించారు. ఈ సందర్భంగాపాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అంగడి అరుణ దేవి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆయన జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటామన్నారు.బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు ప్రతిష్టాత్మక సార్ అనే బిరుదును కూడా ఇచ్చారన్నారు.మానవ సమాజానికి చేసిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన భారతరత్న బిరుదు ప్రధానం చేశారని,ఉపరాష్ట్రపతిగా,రాష్ట్రపతిగా దేశానికి సేవలు అందించారని,రాష్ట్రపతిగా ఉన్నప్పుడు తనకు వచ్చే వేతనంలో కేవలం ఇరవై ఐదు శాతం తీసుకుని మిగిలిన జీతం ప్రధానమంత్రి సహాయ నిధికి తిరిగి ఇచ్చేవాడని ఆయన సేవలను కొనియాడారు.కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పగిడ్యాల్ బోరు కృష్ణయ్య బి.మల్లేష్,కె.వెంకటయ్య, కె.సికిందర్ విద్యార్థులు పాల్గొన్నారు.
ఘనంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES