Monday, January 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

ప్రభుత్వ పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని రామారావుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సావిత్రిబాయి పూలే195 జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించినట్లుగా పాఠశాల ప్రాధానోపాధ్యాయురాలు బి.పద్మ తెలిపారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, మాట్లాడారు. సావిత్రిబాయి భారతీయ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలని, గొప్ప సంఘసంస్కర్త, కవయిత్రి, అణగారిన వర్గాలకోసం, విద్య కోసం, యుద్ధం చేసి, బాలికల విద్య కోసం ఎన్నో ఉద్యమాలు చేసి, వారికి విద్య సమానత్వము కలిగించాలని, బాల్య వివాహాలపై పోరాటాలు చేసినట్లుగా తెలిపారు. మహిళలు పూలెను స్పూర్తితో ముందుకు నడవాలని సూచించారు. పూలే జయంతి సందర్భంగా సావిత్రిబాయి పూలే అవార్డుకు బి.కవిత టీచర్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపికపై అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని,విద్యార్థులు,ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -