Monday, January 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీసీ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

బీసీ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
చదువులతల్లి సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు మండలంలోని కొయ్యుర్ శనివారం జాతీయ బీసీ సంఘం జిల్లా ఇంచార్జి విజయగిరి సమ్మయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొయ్యుర్ సర్పంచ్ కొండ రాజమ్మ,ఉప సర్పంచ్ లకావత్ సవేందర్ హాజరై సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడారు. సావిత్రిబాయి పూలే భారతదేశపు తొలి మహిళ ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్తని కొనియాడారు. ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహకారంతో కొయ్యూరు చౌరస్తాలో మహాత్మ జ్యోతిరావు పూలే ల్, సావిత్రిబాయి పూలే విగ్రహాల ఏర్పాటులో తాను  పూర్తిస్థాయిలో సహకరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెప్పల రజిత, గడ్డo లక్ష్మయ్య, లకావత్ తిరుపతి, మహేందర్, రమేష్, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -