Thursday, January 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి 

ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి 

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం శారాజీపేట గ్రామ మండల ప్రాథమిక పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన గ్రామ సర్పంచ్ కంతి మధు జ్యోతి ప్రజ్వలన చేసి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి నివాళులర్పించారు.ఈ సందర్భంగా సర్పంచ్ కంటి మధు మాట్లాడుతూ.. మహిళా విద్యాభివృద్ధికి సావిత్రిబాయి పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని,ఆమె ఆశయాలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.అనంతరం నూతన సర్పంచ్ కాంతి మధును శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీకుమారి, ఉపాధ్యాయులు పి. భాస్కరాచారి,ఎ. నరేష్, విద్యార్థులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -