– ఆదర్శ జీవనం గడపండి
– పోలీస్ శాఖ
– సే నో టూ డ్రగ్స్,ఎస్ టూ లైఫ్ నినాదంతో చైతన్య ప్రచారం
– నెల రోజులు పాటు కార్యక్రమాలు: – సీఐ నాగరాజు
నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి కావాలని సీఐ నాగరాజు ప్రజలకు పిలుపునిచ్చారు. ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు అశ్వారావుపేట పోలీసుల ఆధ్వర్యంలో నెల రోజుల పాటు “చైతన్యం” పేరుతో నెల రోజులపాటు పలు కార్యక్రమాలు న నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఆయన పోలీస్ సిబ్బందితో గురువారం స్థానిక మూడు రోడ్ల ప్రధాన కూడలి ఆ కార్యక్రమాలు పై ప్రచారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అశ్వారావుపేట మండలంలో మాదక ద్రవ్యాల సమూల నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు భాద్యత ను నిర్వర్తించాలని మండల ప్రజలను కోరారు. చైతన్యం పేరుతో నెల రోజుల పాటు అశ్వారావుపేట మండలం వ్యాప్తంగా పోలీసుల ఆధ్వర్యంలో గంజాయి వంటి మత్తు పదార్ధాల నిర్మూలన కోసం అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ నెల రోజుల పాటు పోలీసులు చేపట్టే కార్యక్రమాలలో ప్రజలు కూడా భాగస్వాములై తమ వంతు భాద్యతగా సహకారం అందించాలని కోరారు.మత్తుకు బానిసలుగా మారిన యువత తమ అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని,వారిలో చైతన్యం నింపేందుకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అశ్వారావుపేట పట్టణంలో గంజాయి పై నిత్యం తనిఖీలు చేపట్టడం,ఎవరైనా మత్తు పదార్దాలను సేవిస్తూ పట్టుబడితే వారికి కౌన్సిలింగ్ నిర్వహించడం,వాహన తనిఖీలు వంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.ఎవరైనా నిషేదిత గంజాయిని రవాణా చేస్తున్నట్లు గానీ,విక్రయిస్తున్నట్లు గానీ,సేవిస్తున్నట్లు గానీ సమాచారం తెలిస్తే పోలీసు వారికి వెంటనే సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్సై రామ్మూర్తి,శిక్షణా ఎస్ఐ అఖిల,సిబ్బంది పాల్గొన్నారు.