గవర్నర్ సంజయ్ మల్హోత్రా
ముంబయి : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చర్యల వల్లనే ఒకప్పుడు నష్టాల్లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఇప్పుడు 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరిందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. ముంబయిలో ఎస్బీఐ బ్యాంకింగ్, ఎనకమిక్స్ కాన్‌క్లేవ్ 2025లో మల్హోత్రా మాట్లాడుతూ.. సెంట్రల్ బ్యాంక్ సంస్కరణల వల్లనే 2018లో నష్టాల్లో ఉన్న ఎస్బీఐ ఈ స్థాయికి చేరిందన్నారు. ఆర్బీఐ రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్, కీలక విధానపరమైన నిర్ణయాలే దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేశాయన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతానికి దీర్ఘకాలిక చర్యలు చేపట్టినట్టు వివరించారు. అదే విధంగా 27గా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను 2020 నాటికి 12కి తగ్గించామన్నారు. బ్యాంకులకు పెద్ద మొత్తంలో మూలధనం సాయం చేశామన్నారు.
ఆర్బీఐ చర్యలతోనే ఎస్బీఐకి లాభాలు
- Advertisement -
- Advertisement -



