Tuesday, March 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజనాభా దామాషా ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు పెంచాలి

జనాభా దామాషా ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు పెంచాలి

- Advertisement -

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో తీర్మానం చేయాలి
రిజర్వేషన్ల పెంపునకు దళిత సంఘాలతో కలిసి ఉద్యమం : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
ఎస్సీ ఉప కులాల నేతలతో సమావేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

జనాభా దామాషా ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు పెంచాలనీ, ఆ మేరకు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లోనే తీర్మానం చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. ఎస్సీ రిజర్వేషన్ల పెంపునకు జాగృతి దళిత సంఘాలతో కలిసి ఉద్యమిస్తుందని ఆమె తెలిపారు. ఎస్సీ ఉప కులాలకు విద్య, ఉద్యోగ రంగాలతో పాటు రాజకీయ రిజర్వేషన్లు దక్కాలన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని జాగృతి రాష్ట్ర కార్యాలయంలో ఆమె ఎస్సీ ఉప కులాల నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీల జనాభా 15 శాతం నుంచి 18 శాతానికి పెరిగినట్టు గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేతో పాటు ప్రస్తుత ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల గణనలో స్పష్టం అయిందని గుర్తుచేశారు. పెరిగిన ఎస్సీల జనాభాకు అనుగుణంగా ఎస్సీ రిజర్వేషన్లను 18 శాతానికి పెంచాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం చేపట్టే జనగణన పూర్తి అయి అధికారికంగా లెక్కలు ప్రకటించిన తర్వాత ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతామని ప్రకటించిందని కవిత గుర్తు చేశారు. దానికి అనుగు ణంగా రిజర్వేషన్ల పెంపునకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీ ఉప కులాలతో కలిసి రిజర్వేషన్ల పెంపు సహా వారి సమస్యల పరిష్కారం కోసం జాగృతి ఉద్యమిస్తుందని తెలిపారు. ఎస్సీ ఉప కులాల్లో కొన్ని కులాలకు క్యాస్ట్‌ సర్టిఫికెట్ల జారీలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో 20 ఎస్సీ ఉప కులాల ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -