Monday, January 26, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఎస్సీ విద్యార్థులు అంటే అంత అలుసా..

ఎస్సీ విద్యార్థులు అంటే అంత అలుసా..

- Advertisement -

బాన్సువాడలో ధర్నా, రాస్తారోకో
ప్రిన్సిపల్ పై కేసు నమోదు చెయ్యాలి
నేతల అండ .. ప్రిన్సిపల్ ఇష్టారాజ్యం
నవతెలంగాణ – బాన్సువాడ (నసురుల్లాబాద్)
ఎస్సీ గురుకుల విద్యా సంస్థల్లో తరచూ అనుమానాస్పద విద్యార్థుల మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. బాన్సువాడ మండలం బొర్లం ఎస్సీ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుకునే సంగీత అనే బాలిక మృతి చెందడంతో విద్యార్థి సంఘాలు, దళిత సంఘాలు భగ్గుమన్నాయి. బొర్లం గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కు స్థానిక అధికార పార్టీ నేతల అండదండలు ఉండడంతో గురుకుల  పాఠశాలను విద్యార్థుల నిర్బంధగృహం మార్చేశారని, విద్యార్థులతో వెట్టి చాకిరి చేయిస్తూ.. అవహేళన చేస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని విద్యార్థి సంఘ నాయకులు మండిపడ్డారు. బోర్లం గురుకుల అంటే  విద్యార్థులు భయాందోళనలకు గురవుతూ, విద్యకు ఆటంకం కలిగి, మానసిక ఒత్తిడికి లోనవుతున్నారనిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బాన్సువాడ లో ధర్నా, రాస్తారోకో
బోర్లకు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ నిర్లక్ష్యం కారణంగా అన్యం పుణ్యం ఎరుగని ఓ పసి బాలిక మృతికి నిరసనగా బాన్సువాడ పట్టణంలో విద్యార్థి సంఘాలు దళిత సంఘాలు, బీఆర్ఎస్ నాయకులు కలసి ఆందోళన ధర్నా, రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. బాన్సువాడ బోధన్ వెళ్లే రహదారిపై విద్యార్థి సంఘ నాయకులు రస్తారోకో చేయడంతో ఇరువైపులా వందలాది వాహనాలు ఎక్కడి అక్కడ  నిలిచిపోయాయి. బాన్సువాడ పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. గురుకుల పాఠశాల ప్రిన్సిపల్కు అధికార పార్టీ నాయకుల అండదండలు పుష్కలంగా ఉండడంతోనే గురుకుల పాఠశాలలో చదువుకునే విద్యార్థులను హీనంగా చూస్తూ వారితో వెట్టి చాకిరి పనులు చేయిస్తుందన్నారు. ప్రశ్నించిన వారికి బెదిరిస్తూ అవమానం పరచడం జరుగుతుందన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ వెంటనే విధులనుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. విద్యార్థి మృతికి  కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బాన్సువాడలో ఉద్రిక్తత
పూర్ణం గురుకుల పాఠశాలలో పొదలిత విద్యార్థిని సంగీత మృతి చెందడంతో విద్యార్థి సంఘాల నాయకులు, దళిత సంఘాలు బాన్సువాడ పట్టణంకు చేరుకున్నాయి. గురుకుల పాఠశాలలో విద్యార్థిని మృతి చెందడంతో బిజెపి నాయకులు ఎండల లక్ష్మీనారాయణ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు షేక్ జుబేర్,అంజిరెడ్డిలు సంఘటన స్థలానికి చేరుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గురుకుల పాఠశాలలో చదువుకునే విద్యార్థులతో తాము మాట్లాడతామని వారి కష్టాలు తెలుసుకుంటామని చెప్పిన పోలీసులు అనుమతించకపోవడంతో కొంతసేపు వాగ్వివాదం జరిగింది. పాఠశాల ప్రిన్సిపల్ పై కఠినమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్, అండ్ బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థిని మృతికి కారణమైన ప్రిన్సిపల్కు సహకరిస్తున్న అధికార పక్ష నాయకులకు నాయకులపై బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తులకు మద్దతు ఇవ్వడం వలన విద్యార్థులు మృతి చెందుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -