Thursday, February 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణ పనులు ప్రారంభం

పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణ పనులు ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – మునిపల్లి
మండలంలోని అంతరం గ్రామంలో పాఠశాల ప్రహరీ గోడ పనులను గురువారం నూతన సర్పంచ్ బంగారిగాళ్ళ పవిత్ర, ఉపసర్పంచ్ ఉప్పరి ప్రభు, గ్రామ వార్డ్ సభ్యులతో కలిసి ప్రారంభించారు. అనంతరం పవిత్ర మాట్లాడుతూ గత పది  సంవత్సరాలుగా పాఠశాలకు ప్రహరీ గోడ లేకపోవడంతో విద్యార్థులు తల్లిదండ్రులు అనేక ఇబ్బందులతోపాటు భయాందోళనకు గురయ్యే వారని, పాఠశాల పక్కనే బిటి రోడ్ ఉండడంతో కంకోల్ నుండి అటు నారాయణాఖేడ్ ఇటు బీదర్ కి రోజుకి వందల వాహనాలు వెళుతూ వస్తూ ఉంటాయని  విద్యార్థులు రోడ్లపైకి వెళ్తే ప్రమాదం జరిగే అవకాశం ఉండేదని ఇప్పుడు ఆ భయం తొలగిపోతుందని ఆనందం వ్యక్తం చేశారు.

గత పాలకులు పాఠశాల ప్రహరీ గోడ పనులు ప్రారంభిస్తామని మాటలకే పరిమితం చేశారని, మేము పాఠశాల ప్రహరీ గోడ విషయాన్ని మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సహకారంతో పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయని అందుకు మంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆమె అన్నారు. పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం పనులు ప్రారంభం అవ్వడంతో గ్రామంలోని విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో జి సుజాత గౌడ్, ఎం. నర్సింలు, ఎం. విట్టల్, బి. నర్సింలు, గ్రామ అధ్యక్షులు మైపాల్ రెడ్డి, యూత్ అధ్యక్షులు మణిరత్నం, ఎన్ ఎస్ యూ ఐ ప్రెసిడెంట్ శివకుమార్, గ్రామ పెద్దలు సీనియర్ నాయకులు కె. మల్లన్న పటేల్, జి. జ్ఞానేశ్వర్ పటేల్, బి. శ్రీనివాస్ పాటిల్,  కె. మధు కుమార్, మాజీ ఎంపిటిసి లక్ష్మయ్య, ఎమ్ డి. వాయిద్ మియా, వి. శ్రీనివాస్, ఎం.విట్టల్, ఎం. రాజు,  మాజీ వార్డ్ నెంబర్ బి. మాణిక్యం, జ్ఞానేశ్వర్,  కె. జ్ఞానేశ్వర్, బి. ప్రభాకర్, పి. లక్ష్మణ్జె, జె. మోహన్, జి. విట్టల్, జి. శ్రీనివాస్, శివ స్వాములు, జి. సాయికుమార్, కె. పాండు, ఎ. విట్టల్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -