- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డిపేట సమీపంలో పెను ప్రమాదం తప్పింది. పాఠశాలకు వెళ్తోన్న ఓ ప్రయివేటు బస్సు మంటలకు ఆహుతైంది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. ప్రమాద సమయంలో స్కూల్ బస్సులో ఐదుగరు విద్యార్థులు ఉండగా.. వారు కూడా బస్సులో పొగరావడం చూసి అప్రమత్తమై వెంటనే బస్సు నుంచి కిందకు దిగారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఫైరింజన్ వచ్చేలోపే బస్సు పూర్తిగా కాలిపోయింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -