Tuesday, November 4, 2025
E-PAPER
Homeజిల్లాలుగుంతలో ఇరుక్కున్న స్కూల్ బస్సు 

గుంతలో ఇరుక్కున్న స్కూల్ బస్సు 

- Advertisement -

తప్పిన పెను ప్రమాదం 
బస్సులో 17 మంది పిల్లలు 
నవతెలంగాణ – మిర్యాలగూడ 

17 మంది విద్యార్థులతో వెళ్తున్న బస్సు ఒక్కసారిగా గుంతలో ఇరుక్కున్న ఘటన సోమవారం సాయంత్రం మిర్యాలగూడలో చోటు చేసుకుంది. వివరాలకు వెళితే….పట్టణంలోని ఓ ప్రయివేట్ పాఠశాల బస్ పిల్లలను దించేందుకు వెళ్లగా.. అగ్రిగోల్డ్ కాలనీలో ప్రమాదవశాతు గుంతలో ఇరుక్కొని ఒక వైపు ఒరిగింది. ఆ సమయంలో బస్ లో 17 మంది పిల్లలు ఉన్నారు. అప్రమత్తమైన డ్రైవరు వెంటనే పిల్లలను కిందికి దించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. పిల్లలకి ఏమి కాకపోవడంతో తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -