Friday, September 26, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంస్కూల్‌ గ్రాంట్‌ రూ.29.74 కోట్లు విడుదల

స్కూల్‌ గ్రాంట్‌ రూ.29.74 కోట్లు విడుదల

- Advertisement -

ఉత్తర్వులు జారీ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో స్కూల్‌ గ్రాంట్‌ కింద రూ.29.74 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు (ఎస్‌పీడీ) ఈ నవీన్‌ నికోలస్‌ గురువారం ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో స్కూల్‌ గ్రాంట్‌ కింద 50 శాతం నిధులను రూ.29.74 కోట్లు విడుదల చేశామని తెలిపారు. ఇందులో ఎస్సీల (24 శాతం) కాంపొనెంట్‌ నిధులు రూ.7.13 కోట్లు, ఎస్టీల (14 శాతం) కాంపొనెంట్‌ నిధులు రూ.4.16 కోట్లు, జనరల్‌ కాంపొనెంట్‌ (62 శాతం) నిధులు రూ.18.44 కోట్లు కలిపి మొత్తం రూ.29.74 కోట్లు విడుదల చేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 22,522 ప్రభుత్వ పాఠశాలలున్నాయని వివరించారు. వాటికి స్కూల్‌ గ్రాంట్‌ కింద వంద శాతం నిధులు రూ.59.48 కోట్ల నిధుల్లో 50 శాతం నిధులు రూ.29.74 కోట్లు ప్రస్తుతం విడుదల చేశామని తెలిపారు. ఇందులో సున్నా ప్రవేశాలు, పీఎంశ్రీ పాఠశాలలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ఈ నిధులు ఇప్పటి వరకు పాఠశాలల ఖాతాల్లో జమ కాలేదని ప్రధానోపాధ్యాయులు చెప్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -