నవతెలంగాణ – ఆర్మూరు
పట్టణంలోని విజయ్ హైస్కూల్లో శనివారం వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి పి.రాజ గంగారాం విశిష్ట అతిథిగా విజయ్ విద్యాసంస్థల అధినేత్రి డా|| అమృతలత లు పాల్గొన్నారు. విద్యార్థులు ఈ కార్యక్రమంలో విజ్ఞాన శాస్త్ర ప్రదర్శన, వెజిటేబుల్ కార్వింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ , ఫుడ్ ఫిట్ నిర్వహించారు. వాటినన్నింటినీ పరిశీలించి ప్రశ్నలకు జవాబులను రాబట్టారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాట్లాడుతూ వైజ్ఞానిక ప్రదర్శనను ఏర్పాటు చేయడం వల్ల పిల్లలలో దాగివున్న అంతర్గత శక్తులు బయటకి వస్తాయని, చదువు పట్ల ఆసక్తి పెరుగుతుందని వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటుకు తోడ్పాటు అందించిన ప్రధానోపాధ్యాయురాలిని, ఇతర ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు.
ఈ కార్యక్రమంలో అధికసంఖ్యలో పాల్గొన్న విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ప్రదర్శనను చూసి ఇంత చక్కగా నిర్వహించినందుకు పాఠశాల యాజమాన్యానికి , విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండింట్ కవితాదివాకర్, ప్రిన్సిపాల్ జి . రమాదేవి, వైస్ ప్రిన్సిపాల్ ఎస్తర్ రాణి, ఉపాధ్యాయ బృందం విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.



