Sunday, July 27, 2025
E-PAPER
Homeక్రైమ్డివైడర్‌ను ఢీకొట్టిన స్కార్పియో

డివైడర్‌ను ఢీకొట్టిన స్కార్పియో

- Advertisement -

– ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు మృతి
– అడిషనల్‌ ఎస్పీకి, డ్రైవర్‌కు గాయాలు
– వారంతా ఏపీకి చెందిన వారు
నవతెలంగాణ-చౌటుప్పల్‌ రూరల్‌

లారీ డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేయడంతో దాన్ని తప్పించే క్రమంలో స్కార్పియో వాహనం అదుపు తప్పి డివైడర్‌ను డివైడర్‌ను ఢీకొట్టిన స్కార్పియోట్టింది. దీంతో ఇద్దరు డీఎస్పీలు మృతిచెందారు. ఈ సంఘటన యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం కైతాపురం జాతీయ రహదారి -65పై శనివారం జరిగింది. చౌటుప్పల్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ జి.మన్మథకుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం..
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పోలీస్‌ ఉన్నతాధికారులు స్కార్పియో వాహనంలో శనివారం ఉదయం విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నారు. యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం కైతాపురం వచ్చేసరికి జాతీయరహదారిపై ఎదురుగా వస్తున్న లారీ డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేశాడు. దాన్ని తప్పించే క్రమంలో వేగంగా ఉన్న స్కార్పియో వాహనం అదుపు తప్పి డివైడర్‌ను డివైడర్‌ను ఢీకొట్టిన స్కార్పియోట్టింది. వాహనం నుజ్జునుజ్జవ్వడంతో స్కార్పియోలో ఉన్న డీఎస్పీలు చక్రధర్‌రావు, శాంతారావు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. కాగా, అడిషనల్‌ ఎస్పీ ప్రసాద్‌, డ్రైవర్‌ నర్సింగ్‌రావుకు గాయాలయ్యాయి. వారిని వెంటనే హైదరాబాద్‌ కామినేని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -