Thursday, October 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యూరియా కోసం పడిగాపులు 

యూరియా కోసం పడిగాపులు 

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవంగర
యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. పెద్దవంగర కో ఆపరేటివ్ రైతు బజార్ వద్ద మంగళవారం ఉదయం నుండి యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఎకరం పొలానికి ఒక బస్తా ఇస్తున్నారని, ఒక బస్తా యూరియా ఎలా సరిపోతుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టడంతో అక్కడికి తహశీల్దార్ వీరగంటి మహేందర్, ఎస్సై క్రాంతి కిరణ్, మండల వ్యవసాయ అధికారి గుగులోత్ స్వామి చేరుకుని రైతులతో మాట్లాడారు. రైతులందరికీ కావాల్సిన యూరియాను త్వరలోనే సరఫరా చేస్తామని, రైతులు యూరియా కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -