నవతెలంగాణ – మద్నూర్
తెలంగాణ ప్రభుత్వం 99 రోజుల ప్రగతి కార్యాచరణ ఈ నెల 6 నుంచి 15 వరకు సాగనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శుక్రవారం మొదటి రోజున మద్నూర్ గ్రామపంచాయతీ పరిధిలో మండల పంచాయతీ అధికారి వెంకట నరసయ్య, కార్యదర్శి సందీప్ కుమార్, పంచాయితీ అధికారులు, సిబ్బంది పర్యవేక్షణలో కార్యాలయ ఆవరణంలోని స్క్రాప్ వస్తువులను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా మండల పంచాయతీ అధికారి వెంకట నరసయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల ప్రగతి కార్యచరణ ప్రణాళికలో భాగంగా మద్నూర్ జిపిలో కార్యాలయ ప్రాంగణాన్ని శుభ్రపరచడం, స్క్రాప్ నిరుపకంగా ఉన్న వస్తువులను తొలగించామని తెలిపారు. ఇక రోజువారి కార్యక్రమాలు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి జిపి ల పరిధిలో కొనసాగుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి, అధికారులు, సిబ్బంది, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.



