146 నామినేషన్ లకు 2 తిరస్కరణ
22 వార్డులకు 108 నామినేషన్ ల వ్యాలిడ్
నవతెలంగాణ – అశ్వారావుపేట
నామినేషన్ పరిశీలన శనివారం పూర్తి అయింది.శుక్రవారం ముగిసిన నామినేషన్ దాఖలు కార్యక్రమంలో మొత్తం 146 నామినేషన్ల స్వీకరించారు. శనివారం పరిశీలనలో 2 నామినేషన్ లు తిరస్కరణ గు గురయ్యాయని మున్సిపల్ ఎన్నికల జిల్లా సహాయ అధికారి, స్థానిక మున్సిపల్ కమిషనర్ నాగరాజు తెలిపారు. 22 వార్డులకు కు గానూ 108 మంది అభ్యర్థులు కు చెందిన 108 నామినేషన్ లు అర్హత పొందాయి.
కాంగ్రెస్, బీఆర్ఎస్ నుండి చెరో 34, బీజేపీ 15, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు కు చెందిన 14, స్వతంత్రులు 8, సీపీఐ ( ఎం), సీపీఐ,జనసేన నుండి ఒక్కో నామినేషన్ లు అర్హత పొందాయి.ఉపసంహరణ మిగిలింది. స్వతంత్రులు, రెబల్స్ ను ఉపసంహరింప జేయడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.


