Monday, August 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలుగూగుల్‌లో ఈ విషయాలు వెతికితే జైలుకే

గూగుల్‌లో ఈ విషయాలు వెతికితే జైలుకే

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : సమాచారం కోసం గూగుల్‌పై ఆధారపడేవారు అప్రమత్తంగా ఉండాలి. చట్టవిరుద్ధమైనవి, ఆర్థిక మోసాలకు సంబంధించినవి, ఆరోగ్య సమస్యలపై సొంత వైద్యం వంటి విషయాలను గూగుల్‌లో వెతకడం తీవ్ర ఇబ్బందులకు దారితీయవచ్చు. బాంబులు, అక్రమ ఆయుధాల తయారీ, డ్రగ్స్ వంటి వాటిపై వెతికితే చట్టపరమైన చర్యలు తప్పవని, తెలియని ఇన్వెస్ట్‌మెంట్ యాప్‌లు, నకిలీ కస్టమర్ కేర్ నంబర్ల వల్ల డబ్బులు పోగొట్టుకునే ప్రమాదం ఉందని, జబ్బుల కోసం గూగుల్ చూసి సొంత వైద్యం చేసుకోవడం ప్రాణాలకే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నమ్మకమైన సమాచారం మాత్రమే చూడాలని, అనుమానాస్పద సైట్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -