Saturday, November 8, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంబాత్రూం బల్బు హౌల్డర్‌లో సీక్రెట్‌ కెమెరా

బాత్రూం బల్బు హౌల్డర్‌లో సీక్రెట్‌ కెమెరా

- Advertisement -

ఇంటి ఓనర్‌, ఎలక్ట్రిషియన్‌పై పోలీసులకు ఫిర్యాదు
నవ తెలంగాణ – బంజారాహిల్స్‌
బాత్రూం బల్బు హౌల్డర్‌లో సీక్రెట్‌ కెమెరాను అమర్చిన దారుణ ఘటన హైదరాబాద్‌ మధురానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళ ఫిర్యాదుతో మధురానగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకెళ్తే.. ప్రయివేటు ఉద్యోగం చేస్తున్న ఓ మహిళ భర్తతో కలిసి జవహర్‌నగర్‌లోని అశోక్‌యాదవ్‌కు చెందిన ఇంట్లో అద్దెకు ఉంటోంది. ఈ నెల 4న బాత్రూంలో విద్యుత్‌ బల్బు పనిచేయడం లేదని వారు ఇంటి యజమానికి చెప్పగా.. అతను ఎలక్ట్రిషియన్‌ చింటుతో రిపేర్‌ చేయించాడు.

అయితే, ఈ నెల 13న బాత్రూంలో బల్బు హౌల్డర్‌ నుంచి ఓ స్క్రూ కింద పడటాన్ని మహిళ భర్త గమనించి పరిశీలించారు. లోపల లైట్‌ వెలుగుతుండగా హౌల్డర్‌ లోపల కెమెరా ఉన్నట్టు గుర్తించి ఇంటి యజమానికి చెప్పాడు. దీనిపై ఎలక్ట్రిషియన్‌ను అడుగుదామంటే అందుకు ఇంటి ఓనర్‌ నిరాకరించాడు. కేసు పెడితే అతను జైలు నుంచి వచ్చిన తర్వాత మీకు అపకారం చేస్తాడని భయపెట్టాడు. దాంతో ఎలక్ట్రిషియన్‌తోపాటు ఇంటి ఓనర్‌పై అనుమానంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని ఇంటి యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ఎలక్ట్రిషియన్‌ కోసం గాలిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -