సీఎం ఓఎస్డీ అజిత్ రెడ్డి
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలిని సందర్శన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ముఖ్యమంత్రి ఒఎస్డీ అజిత్ రెడ్డి శుక్రవారం తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అమలు చేస్తున్న విద్యా కార్యక్రమాలు, విద్యార్థి కేంద్రిత చర్యలను సమీక్షించారు. కమాండ్ కంట్రోల్ రూమ్‌ను పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు సీసీటీవీ నిఘా వ్యవస్థ పనితీరును సమీక్షించారు. 430 జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల హాజరు, విద్యా పురోగతి తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. సిబ్బంది హాజరను రియల్ టైమ్‌లో నమోదు చేసే ఫేషియల్ రికగ్నైషన్ సిస్టమ్ (ఎఫ్‌ఆర్‌ఎస్)ను సమర్థంగా అమలు చేస్తున్నందుకు వారిని ప్రశంసించారు. ఈ వ్యవస్థతో హాజరు శాతం పెరిగిందనీ, సిబ్బంది వినియోగం, కళాశాలల నిర్వహణలో పారదర్శకత మెరుగుపడిందని ఆయన తెలిపారు.
సీసీటీవీ నిఘాతో విద్యార్థుల భద్రత, క్రమశిక్షణ, విద్యా వాతావరణాన్ని బలోపేతం చేస్తున్నట్టు వెల్లడించారు. ఐవీఆర్‌ఎస్ ను సమీక్షించి, విద్యార్థుల ఫిర్యాదులతు వెంటనే స్పందిస్తున్న తీరుపట్ల సంతప్తి వ్యక్తం చేశారు. సేవా సంబంధిత కార్యాచరణలను సులభతరం చేస్తున్న హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (హెచ్‌ఆర్‌ఎంఎస్) పోర్టల్ అమలును కూడా ఆయన అభినందించారు. ఈ పోర్టల్‌తో మానవ జోక్యం తగ్గి, ప్రక్రియలు వేగవంతమై పరిపాలనలో పారదర్శకత పెరిగిందని చెప్పారు. 2026 ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆయన సంబంధిత అధికారులకు సూచించారు.
విద్యామండలి కార్యదర్శి కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ సీసీటీవీ నిఘా, ఫేషియల్ రికగ్నైషన్ ఆధారిత హాజరు వ్యవస్థలతో హాజరు శాతం పెరిగి, సిబ్బంది పర్యవేక్షణ సులభతరం చేసిందని వివరించారు. ఉద్యోగుల సెలవులు, సేవా రికార్డుల వంటి అంశాలను నిర్వహించడానికి హెచ్‌ఆర్‌ఎంఎస్ పోర్టల్ ఉపయోగపడుతున్నదని తెలిపారు. ప్రతి నెల ఇంటర్ బోర్డు ప్రత్యేకాధికారులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలను సందర్శించి హాజరు, స్టడీ అవర్స్, బోధనా విధానాలు, మౌలిక వసతులను పరిశీలిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ పర్యవేక్షణతో ఆయా కళాశాలల్లో మౌలిక వసతులను సమయానుకూలంగా గుర్తించి తగిన చర్యలు తీసుకునే వెసులుబాటు లభించినట్టు చెప్పారు.
సీసీటీవీ నిఘాతో విద్యార్థులకు భద్రత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



