Thursday, February 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పోచమ్మ తల్లి విగ్రహావిష్కరణలో పాల్గొన్న సీతక్క 

పోచమ్మ తల్లి విగ్రహావిష్కరణలో పాల్గొన్న సీతక్క 

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట 
మండలంలోని మచ్చాపూర్ గ్రామంలో  సర్పంచ్ జంపాల ప్రభాకర్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన పోచమ్మ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరై ఆశీర్వాదం అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క  మాట్లాడుతూ.. పోచమ్మ తల్లి దేవాలయం చుట్టూ ప్రహరి గోడ నిర్మిస్తానని, తల్లిని దర్శించే భక్తుల కోసం మంచినీటి బోర్ వేయిస్తానని, గుడికి వెళ్ళే దారి సీసీ రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు.

అలాగే పోచమ్మ తల్లి దేవాలయానికి రూ. 10 వేలు విరాళంగా ఇచ్చారు. అలాగే మచ్చాపూర్ గ్రామంలో ప్రధాన సమస్య భూదాన్ సమస్య అని, ఆ సమస్య వల్ల గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తొందర్లోనే కలెక్టర్ గారితో మాట్లాడి భూదాన్ భూముల సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ  మండల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, ప్రజా ప్రతినిధులు, యూత్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అందరూ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -