పరస్పరం వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గురువారం శాసన సభలో బడ్జెట్‌పై జరిగిన చర్చ సందర్భంగా వ్యక్తిగత విమర్శలు, పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. సభ్యులు సునితా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పెండ్లయి పిల్లలు పుట్టినా కళ్యాణలక్ష్మి చెక్కు అందలేదని ఆరోపించారు. ఈ క్రమంలో జోక్యం చేసుకున్న మంత్రి సీతక్క సునితా లక్ష్మారెడ్డి ఆరోపణలను ఖండించే క్రమంలో సబితా ఇంద్రారెడ్డి పేరుతీసుకున్నారు.
దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తాను మారుమూల అటవీ, గిరిజన ప్రాంతం నుంచి వచ్చిన తాను తెలంగాణ మంత్రివర్గంలో కీలక బాధ్యతలు నిర్వహించడం వారికి ఇష్టం లేదనీ, అందుకే తనను వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దాంతో సబితాతో పాటు పలువురు బీఆర్‌ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో లేని వ్యక్తులు, వ్యక్తిగత విమర్శలు మాని సభ్యులు పద్దులపై మాట్లాడాలని ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క సూచించారు. దాంతో తాము విధానపరంగానే విమర్శలు చేశామే తప్ప సభ్యులపై గౌరవం ఉందని ఇద్దరూ పేర్కొనడంతో వివాదం ముగిసింది.
సీతక్క వర్సెస్ సబితా ఇంద్రారెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



