- Advertisement -
హెచ్చరికలు బెఖాతర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం: ఆర్ఐ సాయిబాబా
నవతెలంగాణ – మద్నూర్
డోంగ్లి మండల పరిధిలోని మంజీరా నది నుండి అక్రమంగా ఇసుక తరలించే ట్రాక్టర్లను మండల ఆర్ఐ సాయిబాబా బుధవారం తెల్లవారుజామున 6 గంటల సమయంలో పట్టుకున్నారు. పట్టుబడిన ఇసుక ట్రాక్టర్లను డోంగ్లి తాసిల్దార్ కార్యాలయానికి తరలించి సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. రెవెన్యూ అధికారుల హెచ్చరికలను బెకతర్ చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్ఐ సాయి బాబా అక్రమ ఇసుక దారులకు హెచ్చరికలు జారీ చేశారు. అనుమతులు లేకుండా మంజీరా నదికి ఇస్కాకు వెళ్తే వాహనాలు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పట్టుబడిన ట్రాక్టర్ల పై జరిమానాలు విధిస్తామని తెలిపారు.
- Advertisement -