- Advertisement -
నవతెలంగాణ – మక్తల్
మక్తల్ పోలీసు స్టేషన్ పరిధిలో దాసారిపల్లి గ్రామ శివారులోని ఎన్‌హెచ్–167 జాతీయ రహదారి పక్కన గల శ్రీ సాయి బాలాజీ దాబా ఫ్యామిలీ రెస్టారెంట్ లో అనుమతులు లేకుండా తంబెళ్ళ రాజశేఖర్ (30) విక్రయిస్తున్నాడనే సమాచారం అందిందని తెలిపారు. ఈ క్రమంలో దాబాపై శనివారం తనిఖీలు చేపట్టి 6 కింగ్‌ఫిషర్ బీర్ బాటిళ్లను పట్టుకొని సీజ్ చేశామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి అనుమతులు లేకుండా మద్యం విక్రయించినా, నిల్వ ఉంచినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించాలని ఆయన కోరారు.
- Advertisement -



