Thursday, March 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

- Advertisement -

నవతెలంగాణ – తిమ్మాజిపేట
మండల కేంద్రంలోని వాల్మీకి నగర్ కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు గురువారం స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలను చక్కగా బోధించారు. ఈ కార్యక్రమంలో డీఈవోగా నిఖిత మండల విద్యాధికారిగా వర్షిత ప్రధానోపాధ్యాయులుగా శిరీష ఉపాధ్యాయులుగా అరవిందు, అఖిల్, చరణ్, మోక్ష హరీష్ కుమార్, భవాని, బాలవర్ధన్, కావ్య, పద్మ మరి కొంతమంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ శెట్టి హాజరై వీక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జైపాల్ రెడ్డి ఉపాధ్యాయ బృందం ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -