నవతెలంగాణ- తుర్కపల్లి
మండలం ములకలపల్లి గ్రామ పరిధిలోని విశ్వభారత్ గ్లోబల్ స్కూల్లో శనివారం స్వపరిపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా ఒక్కరోజు విధులను నిర్వర్తించి అందర్నీ అలరించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ ప్రతిమ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని, రాబోవు కాలంలో పిల్లలు ఉపాధ్యాయులు చెప్పింది మంచిగా విని చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. స్వపరిపాలన దినోత్సవం లో భాగంగా జిల్లా కలెక్టర్గా దుర్గాప్రసాద్ ,డీఈఓ గా వినోద్ కుమార్, ఎంఈఓ గా శ్రీ వర్షిని, కరస్పాండెంట్ గా చైత్రిక్, డైరెక్టర్ గా పెండెం అక్షిత,ప్రిన్సిపల్ గా శ్రీనిధి బాధ్యతలు నిర్వహించారు. అనంతరం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు .ఈ కార్యక్రమంలో కీసర అరుంధతి విద్యాలయం ప్రిన్సిపల్ ప్రసన్న, ఉపాధ్యాయులు లావణ్య, రామ లీల, రాజేశ్వరి, శైలజ, కల్పన, శిరీష స్వీటీ రెడ్డి, నవనీత ,కవిత విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
ఘనంగా స్వపరిపాలన దినోత్సవ వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES