Tuesday, November 4, 2025
E-PAPER
Homeకరీంనగర్సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలి

సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలి

- Advertisement -

ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
పత్తి కొనుగోళ్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల

పత్తి రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. పత్తి కొనుగోళ్లు తదితర అంశాలపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సీసీఐ, మార్కెటింగ్ ఇతర శాఖల అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. జిల్లాలో సీసీఐ ఆధ్వర్యంలో ఐదు జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని, వేములవాడ పరిధిలో రెండు, కోనరావుపేట మండలంలో ఒకటి, ఇల్లంతకుంట మండలంలో రెండు ఉన్నాయని తెలిపారు. రైతులు తమ సమీపంలోని ఆయా సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తి విక్రయించి మద్దతు పొందాలని పిలుపు నిచ్చారు.పత్తి నాణ్యత ఆధారంగా క్వింటాలుకు రూ. 7689 నుంచి 8110 మద్దతు ధర ఉందని వెల్లడించారు.
కపాస్ కిసాన్ లో రైతులు స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు.

సీసీఐ, మార్కెటింగ్, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో రైతులకు వసతులు కల్పించాలని ఆదేశించారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలు, మార్కెటింగ్ కార్యాలయాలు, రైతు వేదికల్లో రైతులు స్లాట్ బుకింగ్ చేసుకునేందుకు సహాయం చేయాలని సూచించారు. ఆయా కొనుగోలు కేంద్రాల్లో 42 మంది రైతుల నుంచి 852 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేశారని వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొనుగోళ్లు పక్కాగా చేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ చంద్రయ్య, మార్కెటింగ్ అధికారి ప్రకాష్, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, సీసీఐ సీపీఓ రఘురామ్, అగ్నిమాపక శాఖ, రవాణా శాఖ అధికారులు, పలువురు రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -