నవతెలంగాణ – జక్రాన్ పల్లి
చిన్నపిల్లల్ని అంగన్వాడి స్కూల్ కు పంపి పౌష్టికాహారం వినియోగించుకోవాలని తొర్లికొండ పంచాయతీ కార్యదర్శి అన్నారు.మండలం లోని తొర్లికొండ గ్రామంలో గ్రామ సభ సర్పంచ్ కాట్పల్లి పద్మా అధ్యక్షతన నిర్వహించారు. గ్రామస్థాయి అధికారులను అన్ని శాఖల నివేదికలను చదివి వినిపించారు. అనంతరం అంగన్వాడీ టీచర్లు మాట్లాడుతూ తగినంత మంది విద్యార్థులు కంగారు వాడి స్కూల్ కి రావడంలేదని తెలిపారు. గ్రామంలోని ప్రైవేటు పాఠశాలల్లో చిన్నపిల్లలు చేరుతున్నారని గ్రామసభ తీసుకువచ్చారు.
చిన్నపిల్లల రెండవ బర్త్ డే కాగానే ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం పిల్లలను వారి పాఠశాలలో చేర్చుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా సెక్రెటరీ మాట్లాడుతూ చిన్నపిల్లలను నాలుగు సంవత్సరాల వరకు అంగన్వాడి స్కూల్ కు పంపించి ప్రభుత్వము అందిస్తున్న పౌష్టికాహారాన్ని చిన్న పిల్లలకు వినియోగించాలని తెలియజేశారు . ప్రభుత్వము అంగన్వాడి పాఠశాలను చిన్నపిల్లలకు కోడిగుడ్డు పాలు తదితర పౌష్టికారాన్ని అందిస్తుందని తెలియజేశారు. తల్లిదండ్రులు గమనించి నాలుగు సంవత్సరాల వరకు చిన్నపిల్లలను అంగన్వాడి పాఠశాలకు పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు



