నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రానికి చెందిన ఫోటోగ్రఫీలో పలు అంతర్జాతీయ అవార్డుల గ్రహీత, సీనియర్ ఫోటోగ్రాఫర్ లుక్క గంగాధర్ ను కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో మంగళవారం ఘనంగా సన్మానించారు. 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా ఫ్రెండ్స్ కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో పలువురు సీనియర్ ఫోటో జర్నలిస్ట్ లను, సీనియర్ ఫోటోగ్రాఫర్లను సన్మానించారు. ఈ సందర్భంగా మండలానికి చెందిన సీనియర్ ఫోటోగ్రాఫర్ లుక్క గంగాధర్ ను శాలువాతో సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు.
ఈ సందర్భంగా ఫ్రెండ్స్ కల్చరర్ అకాడమీ అధ్యక్షులు అజయ్ వర్మ మాట్లాడుతూ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫోటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఫోటోలు సందర్భాన్ని బట్టి కళాత్మకంగా బంధించచడం అంత సులభం కాదన్నారు. ఫొటోలు ఓ తీయని మధుర జ్ఞాపకాలుగా నిలిచి పోతాయన్నారు. మన గతాన్ని, అందుకు సంబంధించిన జ్ఞాపకాలను గుర్తుకు తీసుకువచ్చే ఏకైక ఆధారం ఫోటో చిత్రలేనన్నారు. కళాత్మక నైపుణ్యం క్షణాల్లో ఆలోచించే విధంగా ఫోటోలు ఉంటే, ఆ ఫోటోలు చిరస్థాయిలో నిలిచిపోతాయని, అవే మన ఙ్ఞాపకాలన్నారు. కార్యక్రమంలో బండి సంపత్ కుమార్, శానగోండ వాసు, బండ రమణారెడ్డి, మాజీ కార్పొరేటర్ అనుప్, కమలాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సీనియర్ ఫోటోగ్రాఫర్ లుక్క గంగాధర్ కు ఘన సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES