Tuesday, March 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెద్దతూండ్లలో కుట్టుమిషన్ కేంద్రం ప్రారంభం

పెద్దతూండ్లలో కుట్టుమిషన్ కేంద్రం ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రజా ప్రభుత్వంలో మహిళల అభివృద్ధి ద్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు కుట్టు మిషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా మండలంలోని పెద్దతూండ్ల గ్రామంలో గ్రామ సర్పంచ్ బండారి నర్సింగం, ట్రేడ్ కార్పొరేషన్ చైర్మెన్ ఐత ప్రకాష్ రెడ్డి, మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు, మాజీ పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్యలు మంగళవారం కుట్టుమిషన్ కేంద్రాన్నీ ప్రారభించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ తాళ్ళ రవీందర్, వార్డు సభ్యులు బండ విష్ణువర్ధన్ రెడ్డి, జంబోజు సంధ్యారాణి-రవిందర్, తాటికొండ కేశవచారి, పింగళి వంశీ, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మండల రాహుల్, మాజీ సర్పంచ్ రాజునాయక్, ఎస్సిసెల్ అధ్యక్షుడు రాజ సమ్మయ, కిషన్ నాయక్, జక్కుల వెంకటస్వామి, బియ్యని కుమార్, నరేష్, గంగుల రమేష్, పాలెం శ్రీనివాస్, అంజి, రూపిఎం హనుమంత్ రావు, సిసి, విఓఏలు, స్వశక్తి మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -