Tuesday, March 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబాలికపై లైంగికదాడి

బాలికపై లైంగికదాడి

- Advertisement -

– నిందితుని అరెస్ట్‌, రిమాండ్‌
– వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేటలో ఘటన
నవతెలంగాణ-మోమిన్‌పేట్‌

వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట మండలంలో బాలికపై లైంగికదాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ వెంకట్‌ తెలిపిన వివరాల ప్రకారం మోమిన్‌పేట్‌ మండలానికి చెందిన బాలిక (7వ తరగతి విద్యార్థిని) గతేడాది దీపావళి సెలవుల సమయంలో హాస్టల్‌ నుంచి ఇంటికి వచ్చి, అప్పటి నుంచి ఇంటి వద్దే ఉంటోంది. ఇటీవల ఆమె అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రయివేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా, వైద్యులు పరీక్షలు నిర్వహించి, ఆమె గర్భవతి అయినట్టు గుర్తించారు. దాంతో కుటుంబ సభ్యులు విచారణ చేయగా, వారి ఇంటికి సమీపంలోని అద్దె ఇంట్లో నివసిస్తున్న వ్యక్తి బాలికను మోసం చేసి, ఆమెపై లైంగికదాడికి పాల్పడినట్టు తేలింది. దాంతో బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వికారాబాద్‌ ఎస్పీ స్నేహా మెహ్రా, డీఎస్పీ ఎన్‌.శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో సీఐ జి.వెంకట్‌, వారి సిబ్బంది దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నిందితుడు ఉద్దాల మాణిక్యంను అరెస్టు చేశారు. నిందితుడు సైదలిపూర్‌ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా.. జడ్జి జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు. ఈ ఘటనపై మరింత దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. బాలికల భద్రత విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిల్లలు హాస్టల్స్‌ లేదా పాఠశాలలకు వెళ్లే సందర్భాల్లో వారి రాకపోకలపై తగిన పర్యవేక్షణ అవసరమని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలు గమనించిన వెంటనే సమీప పోలీస్‌స్టేషన్‌కు లేదా డయల్‌ 100 ద్వారా సమాచారం అందించాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -