- Advertisement -
యువకునిపై పోక్సో కేసు
నవతెలంగాణ- కేతేపల్లి
బాలికపై లైంగికదాడికి చేసిన దుండగునిపై పోక్సో నమోదైంది. ఈ ఘటన నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొప్పోలు గ్రామంలో శుక్రవారం జరిగింది. ఎస్‌ఐ యు.సతీష్ తెలిపిన వివరాల ప్రకారం… కొప్పోలు గ్రామానికి చెందిన దుర్గం కమలాకర్ అదే గ్రామంలో అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఓ బాలికకు మాయమాటలు చెప్పి లైంగికదాడికి ఒడిగట్టాడు. విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో.. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బాలికను నల్లగొండ భరోసా కేంద్రానికి తరలించారు. కౌన్సెలింగ్ ఇప్పించి వైద్యపరీక్షలకు పంపించారు. కమలాకర్‌పై నిర్భయ, పోక్సో కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



