- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి: కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం కేంద్రంలోని ఆర్ఆర్ టాలెంట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని 565 మార్కులు సాధించి స్కూల్ టాపర్ గా నిలిచిన పాల్వంచ మండలం వేల్పుగొండ గ్రామానికి చెందిన సిమ్రా ఫిర్దోస్ ను ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ సన్మానించి, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని తల్లిదండ్రులతో పాటు కాంగ్రెస్ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
- Advertisement -