Saturday, August 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్షబ్బీర్ అలీకి రాజ్యాంగ సంపుటిక బహుమతి అందజేత

షబ్బీర్ అలీకి రాజ్యాంగ సంపుటిక బహుమతి అందజేత

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి  శనివారం కామారెడ్డి లోని ఆయన నివాసంలో యువజన కాంగ్రెస్ నాయకుడు సందీప్ కుమార్ రాజ్యాంగ సంపుటికను బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా యువజన కాంగ్రెస్ నాయకుడు ఐరేని సందీప్ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల హక్కును కాపాడుతున్న రాజ్యాంగాన్ని రద్దు చేస్తామన్న కొన్ని దుష్టశక్తులను అడ్డుకునే క్రమంలో ముందు వరుసలో ఉండి రాజ్యాంగాన్ని కాపాడుటకై పోరాడుతున్న  ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ కి రాజ్యాంగ సంపుటిక ను ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు.

ఎలాంటి వివక్ష లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ప్రభుత్వ పథకాలను అందిస్తున్న షబ్బీర్ అలీ  నాయకత్వంలో కామారెడ్డి మరింత అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కొత్త రేషన్ కార్డులతో పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నిండుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, కామారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూడెం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ గంప ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -