నవతెలంగాణ – కామారెడ్డి
రోడ్డు ప్రమాదంలో మంగళవారం మృతి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి భౌతిక కాయానికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ బుధవారం నివాళులర్పించారు. తూప్రాన్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి బుధవారం చేరుకున్న షబ్బీర్ అలీ, మోహన్ రెడ్డి మృతదేహాన్ని పరిశీలించి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి అధికారులతో మాట్లాడి, మోహన్ రెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చారు. పార్టీ ఒక బలమైన నాయకుడిని కోల్పోయిందని, వారి కుటుంబానికి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
నారెడ్డి మోహన్ రెడ్డికి షబ్బీర్ అలీ నివాళి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



