Thursday, December 18, 2025
E-PAPER
Homeసినిమాసరికొత్త సౌండింగ్‌తో 'శంబాల'

సరికొత్త సౌండింగ్‌తో ‘శంబాల’

- Advertisement -

ఆది హీరోగా షైనింగ్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై రాజశేఖర్‌ అన్నభి మోజు, మహీధర్‌ రెడ్డి నిర్మించిన చిత్రం ‘శంబాల’. యగంధర్‌ ముని దర్శకుడు. అర్చన అయ్యర్‌, స్వసిక, రవివర్మ, మధునందన్‌, శివ కార్తీక్‌ కీలక పాత్రలు పోషించారు. ఈనెల 25న రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో గురువారం సంగీత దర్శకుడు శ్రీ చరణ్‌ పాకాల మీడియాతో చిత్ర విశేషాలను షేర్‌ చేసుకున్నారు. ‘శంబాల’లో చాలా థీమ్స్‌ ఉంటాయి. దర్శకుడు కథ చెప్పిన నెక్ట్స్‌ డే నుంచి వర్క్‌ స్టార్ట్‌ చేశాను. డైరెక్టర్‌ యుగంధర్‌కి సౌండింగ్‌ మీద మంచి నాలెడ్జ్‌ ఉంది.నేను ఎన్నో థ్రిల్లర్స్‌ పని చేశాను. కానీ ‘శంబాల’ లాంటి సైంటిఫిక్‌, మైథలాజికల్‌ థ్రిల్లర్‌కు పని చేయడం కొత్తగా అనిపించింది.

ఇలాంటి చిత్రాలకు సీట్‌ ఎడ్జ్‌లో కూర్చో పెట్టాలంటే సౌండ్‌ మరింత గొప్పగా ఉండాలి. సౌండ్‌తో ఆడియెన్స్‌ని ఎక్కువగా మిస్‌ లీడ్‌ చేయాల్సి ఉంటుంది. కథలో భాగంగా వచ్చే నాలుగు పాటలు అద్భుతంగా ఉంటాయి. నేను చిన్నప్పటి నుంచి మన మైథలాజికల్‌ స్టోరీస్‌ వింటూనే పెరిగాను. ఇప్పుడు ఆ జోనర్‌లో వచ్చిన కథకు మ్యూజిక్‌ ఇవ్వడం ఆనందంగా ఉంది. ఈ మూవీ కోసం నేను రకరకాల ఇన్‌స్ట్రూమెంట్స్‌ను వాడాను. నేను నా సొంత పని కోసం కొన్న ఓ పరికరాన్ని కూడా ఈ మూవీ కోసం వాడాను (నవ్వుతూ). సౌండ్‌ డిజైనింగ్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. థియేటర్‌లో ఈ మూవీని చూస్తేనే మంచి ఫీల్‌ వస్తుంది. ఆర్‌ఆర్‌ అద్భుతంగా ఉంటుంది.

ఇందులో సౌండ్‌ చాలా యూనిక్‌గా ఉంటుంది. ఈ మూవీని థియేటర్‌లో చూస్తేనే సౌండింగ్‌ను ఎంజాయ్ చేస్తారు. నా వాయిస్‌తోనే రకరకాల సౌండ్స్‌ను ఇచ్చాను. అవన్నీ కూడా డైరెక్టర్‌కు బాగా నచ్చాయి. నిర్మాతలు ఎక్కడా ఎవ్వరినీ కంగారు పెట్టలేదు. కావాల్సినంత టైం ఇచ్చారు. మంచి అవుట్‌ పుట్‌ కోసం చాలా ఖర్చు పెట్టారు. ఆది ప్రతీ సినిమాలో ఓ చార్ట్‌ బస్టర్‌ సాంగ్‌ ఉంటుంది. ఈ మూవీలో కూడా అలాంటి ఓ మెలోడీ సాంగ్‌ ఉంది. అది త్వరలోనే రిలీజ్‌ అవుతుంది. ఎండ్‌ టైటిల్‌లో వచ్చే పాట కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. ఆదికి ఇది చాలా కొత్త, వెరైటీ చిత్రమని చెప్పుకోవచ్చు. ఈ మూవీ అందరినీ మెస్మరైజ్‌ చేసేలా ఉంటుంది. కొత్త ప్రపంచానికి తీసుకెళ్లేలా ఉంటుంది. ఇది నా కెరీర్‌లో 49వ చిత్రం. ‘అనుమానపు పక్షి’ నా 50వ చిత్రం. ఈ రెండు చిత్రాలు నాకెంతో ప్రత్యేకం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -