Monday, September 22, 2025
E-PAPER
Homeసినిమాసైకిల్‌ రేసర్‌గా శర్వా..

సైకిల్‌ రేసర్‌గా శర్వా..

- Advertisement -

ఎప్పటికప్పుడు వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న కథా నాయకుడు శర్వా.. ఈసారి సైకిల్‌ రేసర్‌గా కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఆయన అభిలాష్‌ కంకర దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇది ఆయన నటిస్తున్న 36వ చిత్రం. స్కిల్డ్‌ మోటార్‌ సైకిల్‌ రేసర్‌గా శర్వా నటిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. శర్వా, టీమ్‌పై సైకిల్‌ రేస్‌కు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా ఉండబోతున్నాయి. యూనిక్‌ క్యారెక్టర్స్‌తో ఆకట్టుకునే శర్వా ఈ చిత్రంలో ఓ ఛాలెంజింగ్‌ క్యారెక్టర్‌ చేస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఆడ్రినలిన్‌ రష్‌ని ఇచ్చే స్టంట్స్‌తో అదరగొట్టబోతున్నారు. ఈ చిత్రంలో మాళవిక నాయర్‌ కథానాయికగా నటిస్తుండగా, బ్రహ్మాజీ, అతుల్‌ కులకర్ణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. నిర్మాతలు వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్న ఈ హై-ఎనర్జీ మూవీ మోటోక్రాస్‌ రేసింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది అని చిత్ర యూనిట్‌ తెలిపింది.

‘మా కథానాయకుడు శర్వా.. సరికొత్త పాత్రతో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేయనున్నారు. కంటెంట్‌ పరంగా ఆయన ప్రతి సినిమా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఆయన పోషించే పాత్రలు సైతం అదే తీరుతో ఉంటూ ప్రేక్షకులను, ఆయన అభిమానులను విశేషంగా అలరిస్తున్నాయి. ఈ సినిమా కూడా అదే కోవలో ఉంటుంది. ఈ సినిమాలోని పాత్రను శర్వా ఎంతో ఛాలెంజింగ్‌గా తీసుకున్నారు. ఈ సినిమా తప్పకుండా అందర్నీ మెప్పిస్తుందనే నమ్మకంతో ఉన్నాం. సినిమా చాలా అద్భుతంగా వస్తోంది. దర్శకుడు అభిలాష్‌ తనదైన కథ, మేకింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తాడని ఆశిస్తున్నాం. త్వరలోనే మరిన్ని వివరాలను తెలియజేస్తాం’ అని మేకర్స్‌ చెప్పారు. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: అభిలాష్‌ కంకర, నిర్మాతలు: వంశీ-ప్రమోద్‌, సమర్పణ: విక్రమ్‌, సంగీతం: జిబ్రాన్‌, డీవోపీ: యువరాజ్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రాజీవ్‌, ఎడిటర్‌: అనిల్‌ కుమార్‌ పి., ఆర్ట్‌ డైరెక్టర్‌: ఎ పనీర్‌ సెల్వం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -