- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
తహశీల్దార్ కార్యాలయానికి వివిధ పనుల కోసం మండలంలోని వివిధ గ్రామాల నుండి వచ్చే జనాల సౌకర్యార్థం మద్నూర్ గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో కార్యాలయ ఆవరణలో షెడ్డు నిర్మాణ పనులను బుధవారం చేపట్టారు. దీంతో సర్పంచ్ ఉషా-సంతోష్ మేస్త్రీ తహశీల్దార్ ఎండి ముజీబ్, కార్యాలయ అధికారులు, సిబ్బంది, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
- Advertisement -



