నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నూతన అధ్యక్షునిగా మద్నూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శివాజీ రాథోడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నూతన కమిటీని కామారెడ్డి జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు ఆధ్వర్యంలో మండల కేంద్రంలో సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. నూతన కమిటీ ఈ విధంగా ఉంది.
అధ్యక్షునిగా శివాజీ రాథోడ్, ప్రధాన కార్యదర్శిగా బాలాజీ రాథోడ్, ఉపాధ్యక్షులుగా సంతోష్ రాథోడ్, జాదవ్ మాధవ్, సహాయ కార్యదర్శులుగా జాదవ్ శేషారావు, రాథోడ్ వసంత్, కోశాధికారిగా రాథోడ్ శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు పవార్ కుశాల్, ఈ విధంగా మద్నూర్ మండల ఆల్ ఇండియా బంజారా సేవా సాంగ్ నూతన కమిటీని అనుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షునిగా ఎన్నికైన శివాజీ రాథోడ్ మాట్లాడుతూ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో లంబాడ జాతుల హక్కుల పోరాటానికి ప్రత్యేకంగా కృషి చేస్తానని తెలిపారు. అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు జిల్లా రాష్ట్ర నాయకులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.