Friday, February 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పోలీసుల అదుపులో శివాజీ విగ్రహం 

పోలీసుల అదుపులో శివాజీ విగ్రహం 

- Advertisement -

నవతెలంగాణ – మోర్తాడ్ 
మండల కేంద్రంలో శివాజీ జయంతి సందర్భంగా శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని యువజన సంఘాలు ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. యువజన సంఘాల సభ్యులు శివాజీ విగ్రహాన్ని తీసుకొస్తున్న సమయంలో గ్రామంలో పోలీసుల అడ్డుకొని అనుమతి లేకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేయకూడదని యువజన సంఘాల సభ్యులకు సూచించారు. తమ గ్రామంలో శివాజీ విగ్రహం ఏర్పాటు చేస్తామని యువజన సంఘాల సభ్యులు ముక్తకంఠంతో నినాదాలు చేయడంతో విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇచ్చి విగ్రహ ఏర్పాటు ప్రదేశానికి చేరుకోవడంతోనే మళ్లీ అనుమతి లేదని అడ్డుకున్నారు.

ఏసీపి వెంకటేశ్వర్లు సంఘటన స్థలాలకి ప్రభుత్వ అనుమతి లేకుండా విగ్రహాలు ఏర్పాటు చేయకూడదని జాతీయ రహదారి సమీపంలో విగ్రహాలు ఏర్పాటు చేయడం వలన ప్రమాదంలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ తెలిపారు. కోర్టు ప్రభుత్వ అనుమతి లేకుండా విగ్రహాలు ఏర్పాటు చేస్తే చట్టపర్యమైన చర్యలు తీసుకుంటామని యువజన సంఘాలకు సూచించారు. అయినప్పటికీ తాము ఈ ప్రదేశంలో శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని జాతీయరాదే సమీపంలో బయట నుంచి నిదర్శన తెలపడంతో పోలీస్ బందోబస్తుతో యువజన సంఘాలను చదరగొట్టారు. అనంతరం వాహనం నుండి శివాజీ విగ్రహాన్ని వేరే ప్రదేశంలో విగ్రహం ఉంచారు. గత కొన్ని రోజుల నుండి ఆ ప్రదేశంలో విగ్రహం ఏర్పాటు చేయకూడదు అంటూ పోలీసులు కేటింగ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం శివాజీ విగ్రహం పోలీస్ అదుపులో ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -