Friday, April 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శివంగి ఆత్మీయ పురస్కార గ్రహీత సంధ్యారెడ్డికి ఘన సన్మానం 

శివంగి ఆత్మీయ పురస్కార గ్రహీత సంధ్యారెడ్డికి ఘన సన్మానం 

- Advertisement -

సూది రెడ్డి జనార్దన్ రెడ్డి సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు 
నవతెలంగాణ-గోవిందరావుపేట 

మండలంలోని పసర గ్రామానికి చెందిన రెడ్డి సంధ్యారెడ్డి ఇటీవల రవీంద్రభారతిలో శివంగి ఆత్మీయ పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా మండల రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సన్మానించడం జరిగిందని అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రెడ్డి సంక్షేమ భవన్ లో సంధ్యారెడ్డి సన్మానం ను ఉద్దేశించి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ సంధ్య రెడ్డి చాలా సంవత్సరాలుగా సమాజ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. మహిళా అభివృద్ధి చేసిన కృషిని విశేషంగా కొనియాడారు. అనంతరం సంధ్యారెడ్డిని శాలువాతో సన్మానించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు  కొమురెల్లి భూమిరెడ్డి అం తిరెడ్డి సత్యనారాయణరెడ్డి మిరియాల యాదగిరి రెడ్డి రావుల సంపత్ రెడ్డి కొమ్మూరు సంజీవరెడ్డి మట్ట వెంకట పాపిరెడ్డి ఏనుగు రవీందర్ రెడ్డి కర్ర సాంబశివరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -