Friday, September 11, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంచికాగోలో కాల్పుల ఘ‌ట‌న‌లు..ఏడుగురు మృతి

చికాగోలో కాల్పుల ఘ‌ట‌న‌లు..ఏడుగురు మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికాలోని చికాగోలో ఇటీవల జరిగిన కాల్పుల ఘటనల్లో సుమారు ఏడుగురు మృతిచెందగా, 38 మంది గాయపడ్డారు. శుక్రవారం నుంచి జరిగిన ఈ హింసాత్మక ఘటనలపై అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. చికాగోలో మిలిటరీని ప్రవేశపెట్టేందుకు ఆయన ఆలోచిస్తున్నట్లు సమాచారం. సుమారు 20కి పైగా ప్రదేశాల్లో కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఒక చోట సామూహిక కాల్పుల్లో 12 మంది గాయపడ్డారు. చికాగోను సురక్షిత నగరంగా మార్చగలనని ట్రంప్ తన సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -